అందరి అమెరికా అధ్యక్షుల్లో #డోనాల్డ్_ట్రంప్ చెత్త అధ్యక్షుడు అని చెప్పడానికి గల కారణాలు :
1. చర్చలు జరిపి ఉత్తర కొరియా అణ్వాయుధ ముప్పు తగ్గించడం
2. చైనా తో అమెరికాకు గల వాణిజ్య.లోటును తగ్గించి
చైనాతో సమం చెయ్యడానికి ప్రయత్నించడం.
3. ఇస్లామిక్ తీవ్రవాదం ముఖ్యంగా ఐ సీస్ మీద గట్టి చర్యలు తీసుకొని దానిని దాదాపు తుద ముట్టించి ప్రపంచ శాంతికి ప్రయత్నించడం
4. ఇజ్రాయెల్ మరియు ఇస్లామిక్ గల్ఫ్ దేశాల మధ్య చర్చలు జరిగేలా చూసి ఈ దేశాల మధ్య శాంతి చర్చలు సఫలం కావడానికి కృషి చేయడం, దశాబ్దాలుగా వాటి మధ్య ఉన్న శత్రుత్వం తగ్గించడం
5. గత కొందరు అమెరికా ప్రెసిడెంట్స్ లాగా ఎదో కారణం చూపి ఎదో దేశం మీద దండెత్తి బాంబుల వర్షం కురిపించలేదు.
6. నాటో దేశాల రక్షణ విషయాలు వారే చూసుకోవాలి అన్నట్లుగా బడ్జెట్లో మార్పులు చెయ్యడం..
No comments:
Post a Comment