Saturday, 23 January 2021
టాటా నానో పరిశ్రమ - సింగూర్ నష్టం - సానంద్ లాభం
Tuesday, 19 January 2021
ట్రంప్ - చెత్త ప్రెసిడెంటా?
Saturday, 16 January 2021
సంక్రాంతి - పందాలు - విశిష్టత
Thursday, 14 January 2021
అంబానీ - ఆదాని- హిందూస్తాన్ లీవర్
సోషల్ మీడియాలో ఉదయం లేస్తే అంబానీ ఆదానిని
తిడుతూ వందల పోస్టులు పెడుతున్నారు.
సరే...ఒక సారి ఇది చదవండి...
బ్రిటన్ కంపనీ లీవర్ హిందూస్తాన్ లీవర్ గా మారి 70 సం. లుగా ఈ దేశంలో ఉన్న వనరులే వాడుతూ సబ్బులు, తలనూనెలు, పేస్టులు డిటర్జెంట్స్ సౌందర్య సాధనాలు ఇలా ప్రతీ వస్తువూ అమ్ముతూ అంబానీ, ఆదాని, టాటా, బిర్లాలు అందరి కంటే ఎక్కువ సంపాదించి వేల కోట్ల లాభాలు సంపాదిస్తూ బ్రిటన్ పట్టుకుపోతోంది.
కానీ మనకు ఎప్పుడూ బాధ గాని నొప్పి గాని అనిపించలేదు.
అయ్యో మన దేశంలో కూడా అటువంటి పెద్ద కంపనీలు తయారు అయి పలు దేశాలలో వ్యాపారం చేసి మన దేశానికి డబ్బులు సంపాదిస్తే బాగుండును అన్న అలోచన కూడా ఎప్పుడూ రాలేదు.
బాగా చదువుకున్న వారి ఆలోచలను కూడా కమ్యూనిజం ఇంతలా కలుషితం చేసింది అంటే ఇంకా ఈ దేశంలో చదువురాని వారిని ఈ కమ్యూనిజం ఎంత బ్రష్టు పట్టించి ఉంటుందో ఆలోచించండి.
ఈ దేశంలో వ్యక్తుల సామర్ధ్యానికి తెలివితేటలకు లోటు లేదు. రామ్ దేవ్ బాబా నేను పతంజలి సంస్థను దేశీయ MNC గా తయారు చేసి విదేశీ FMCG హిందూస్తాన్ లీవర్ వంటి సంస్థలని ఎదుర్కొంటాను అని ఛాలెంజ్ చేసాడు. ఒక్క 10 సం. లలో వాటికి పోటీగా నిలిపి అనుకున్నది సాధించాడు.
కానీ అతనిని మనమే వెక్కిరిస్తాం. అతని ప్రొడక్ట్స్ క్వాలిటీ గురించి ప్రశ్నిస్తాo. అతని మెల్ల కన్నుని, గోచీ కట్టుకోవడాన్ని ఎగతాళి చేస్తాం తప్ప ఒక సాధారణ వ్యక్తి పట్టుదల ఉంటే ఎంతలా ఎదగగలడో అతనిని ఈ తరానికి చూపి స్ఫూర్తిని ఇవ్వం.
కానీ హిందూ స్థాన్ లీవర్ వాడు మా సబ్బు వాడితే తెల్లగా అవుతుంది అని చెపితే మన చర్మం తెల్లబడక పోయినా70 ఏళ్లుగా వాడుతూనే ఉన్నాం. వాడి కంపెనీని వెక్కిరించం. ఎందుకంటే మనకు వెయ్యి సం. ల బానిస బతుకు అలవాటు అయి మనదేశంలో వాళ్ళు చెప్పే దానికన్నా తెల్లవాడు చెప్పింది ఎక్కువ నమ్ముతాం సో కాల్డ్ చదువుకున్న మేధావులతో సహా...
ఒక్క టాటా, బిర్లా, ఆదాని, అంబానీ, రాం దేవ్ బాబా మాత్రమే కాదు అన్ని దేశీయ కంపెనీలు ఎదిగితేనే విదేశీ MNCల తో పోటీ పడగలవు. విదేశాల్లో వ్యాపారాలు చేసి దేశానికి ఫారెన్ ఎక్స్చేంజి సంపాదించగలవు.
ఎదో కారణం చూపి మన దేశంలోనే వాటిపై ద్వేషం పెంచి ఎదగకుండా చేస్తే మన తెలివైన వ్యాపారవేత్తలు, పారిశ్రామిక వేత్తలు ఈ హింస భరించలేక లక్ష్మీ మిట్టల్ లా పై దేశం పోయి వ్యాపారాలు చేసుకుంటారు.
నెహ్రు గారు వ్యాపార వేత్తలను అసహ్యించుకునే వారు అని స్వయంగా JRD టాటా గారు ఒక ఇంటర్వ్యూ లో చెప్పారు. నెహ్రు గారికి ప్రైవేట్ వ్యాపార, పారిశ్రామిక వేత్తలు అంటే పడేది కాదు. కానీ ఆయనతో సహా ఆయన కాబినెట్ మంత్రులు అధికారులు విదేశీ ప్రైవేట్ MNC వస్తువులే వాడేవారు, విదేశీ ప్రైవేట్ కంపెనీల కార్లలోనే తిరిగే వారు.
మిట్టల్ కుటుంబం మార్వాడీలు. కలకత్తా స్టీల్ వ్యాపారం చేసే వారు. 1976లో ఇక్కడ దేశంలో ఇందిర ప్రైవేట్ స్టీల్ పరిశ్రమ మీద నిషేధం పెట్టడంతో ఇండోనేషియా వెళ్లి అక్కడ మొదటి పరిశ్రమ పెట్టి అక్కడ నుండి త్రినిడాడ్ పోయి అక్కడ దివాళా తీసిన స్టీల్ పరిశ్రమలు కొని వాటిని లాభాల బాటలోకి తెచ్చారు.
ఆ తరువాత యూకే వెళ్లారు. ఆర్సెల్ మిట్టల్ అని ప్రపంచంలోనే పెద్ద స్టీల్ పరిశ్రమ కంపనీ స్థాపించి ఎంతో ఎత్తుకు ఎదిగారు. 2005 కి మిట్టల్ ప్రపంచ మొదటి 10 మంది ధనవంతుల్లో ఒకరు. ఆ లిస్ట్ లో చేరిన మొట్ట మొదటి భారతీయుడు.
మనకి ఇనుప ముడి ఖనిజం కుప్పలు తెప్పలుగా ఉంది. ఇక్కడ దేశంలో ఆ ముడి ఖనిజం వాడుకునే అన్ని స్టీల్ పరిశ్రమలు, స్టీల్ వినియోగం లేక మన బైలదుల్లా నుండి ముడి ఖనిజాన్ని ప్రత్యేక రైల్వే లైన్ వేసి జపాన్ ఎగుమతి చేసుకుంటున్నాం.
అదే ఆ మనిషిని ఈ దేశంలో వ్యాపారం చెయ్యి నిచ్చి ఉంటే స్టీల్ పరిశ్రమ ఎప్పుడో అభివృద్ధి చెంది ఉండేది. ప్రపంచ స్టీల్ పరిశ్రమ ఉత్పత్తి కేంద్రంగా భారత్ నిలిచి ఉండేది. అతని సంపద భారత్ లో ఉండేది. ఆయన ఎందరికో ఉపాధి చూపించి ఉండేవాడు కదా!
ఈ సోషలిజం ఎంత తప్పుడు ఆలోచనలు మన మనసుల్లో చొప్పిస్తున్నదో ఒక్క సారి ఆలోచించండి.
రిలయన్స్ పెట్టి 47 సం. లు అయింది. ఆస్తులు 11లక్షల కోట్లు.
అమెజాన్ పెట్టి 10 సం. లు అయింది ఆస్తులు 18 లక్షల కోట్లు
చైనా అలిబాబా కంపనీ మొదలు పెట్టి 20 సం. లు అయింది. ఆస్తులు 15 లక్షల కోట్లు.
అమెరికా ఎదగడానికి ఒక మైక్రోసాఫ్ట్, ఒక గూగుల్, ఒక అమెజాన్ ఇలా బోల్డు పెద్ద కంపెనీల వల్ల ఎదిగింది. అలాగే చైనా డజన్ల కొద్దీ ప్రైవేట్ MNC లను ఎదగనిచ్చింది. ఇప్పుడు అమెరికాతో ప్రపంచ మొదటి స్థానానికి పోటీ పడుతోంది.
ఇలా ప్రతీ దానికి అడ్డు పడి వామపక్షాలు బెంగాల్ నాశనం చేశాయి. యూనియన్స్ కి కొమ్ములు ఇచ్చి సమ్మెలు బందులు చేసి ఒక నాడు దేశంలో ఒక పెద్ద ఇండస్ట్రియల్ హబ్ గా పెరు పొందిన కలకత్తా పేరు నాశనం చేశారు.
CPM దగ్గర నేర్చుకున్న విద్య తో మమతా టాటా నానో ప్రాజెక్ట్ అడ్డుకుంది. సింగూర్ రైతులు అలా బీద వాళ్లుగానే ఉండిపోయారు.
అదే టాటా నానో పరిశ్రమ మోడీ సీఎం గా ఉన్నప్పుడు గుజరాత్ తీసుకుపోయి సానంద్ లో అన్ని సదుపాయాలు కల్పించాడు. ఇప్పుడు సానంద్ ప్రపంచంలోనే ఒక పెద్ద ఆటోమొబైల్ ఇండస్ట్రియల్ హబ్. అక్కడ అన్ని కంపెనీలు అంటే టాటా, మారుతి, హుందాయి, ఫోర్డ్, హోండా మొ. కంపెనీలు కార్లు స్కూటర్లు, మోటారు సైకిల్స్ ఉత్పత్తి చేస్తున్నాయి. అక్కడ రైతులు కోటీశ్వరులు అయిపోయారు. స్థానికులకు ఉద్యోగాలు దొరికాయి.
https://www.google.com/amp/s/wap.business-standard.com/article-amp/companies/sanand-the-new-global-auto-hub-115032200818_1.html
మీరే ఆలోచించుకోండి మన దేశ కంపెనీల మీదే మనమే ద్వేషం పెంచి ఎదగకుండా చేసే ఇటువంటి ఆలోచనలు పెంచడం వల్ల మన దేశానికి మంచి జరుగుతుందా లేక చెడు జరుగుతుందా అని.
ఈ క్రింద ఫోటోలు చూడండి. కుడి వైపు ఫోటో చైనా MNCలది. రెండోది US, యూరోప్ MNC లది. స్వాతంత్రం వచ్చి 70 సం. లకు పైగా అయింది. ఎన్ని భారత్ కంపెనీలు పేర్లు దీనిలో ఉన్నాయో వెతకండి.
.....చాడా శాస్త్రి...
హంపీ పై పేరడీ పాట
ఆ మధ్య హంపి వెళ్లి చూసినపుడు కలిగిన బాధానుభూతులే ఈ పేరడీ పాటకు ప్రేరణ :
అహో అంధ రాజా! ఓ క్రూర ముష్కర పాలకా!
విజయనగర విధ్వంస కర్కశ కఠినాత్ముడా !
ఈ శిలలలో రుధిరాన్ని చిమ్మినావయా !
శిలలపై పంతాలు పట్టినారు
శిలలపై పంతాలు పట్టినారు
ముష్కరులు సృష్టి కే గునపాలు
గుచ్చినారు ..ఊ..ఊ.. "శిలాలపై"
బండ గుండెల గల వారికైనా
బండ గుండెల గల వారికైనా
కరిగించి కన్నీరు తెప్పించగల వీటిపై
శిలలపై పంతాలు పట్టినారు...ఊ...ఊ..
ఒకవైపు ఉన్మాదమూక కవాతులు
ఒక పక్క మతమౌఢ్య వర్గశత్రువులూ
ఒకచెంప క్రూరాతి క్రూర ముఖాలు
ధ్వంస రచనచేయ నగరానికొచ్చారు
కనులు ఉండికూడా కబోదులయ్యారు
కనులు ఉండికూడా కబోదులయ్యారు
శిలల కంటే కూడా హీనమనిపించారు....శిలల
ఏకశిల రథమును భారిసుత్తులతోనా
తుత్తినియలు చేయ విఫలమైనారు
ఏకశిల రథమును భారిసుత్తులతోనా
తుత్తినియలు చేయ విఫలమైనారు
రాతి స్థంబాలచే రాక్షసత్వముతో
విలాపరాగాలు వినిపించుకున్నారు
వెతలు తీర్చెదన్న విరూపాక్ష సన్నిధిని
వెతలు తీర్చెదన్న విరూపాక్ష సన్నిధిని
విడవ కుండాకూడా విరిచేసేలాగా..
శిలలపై పంతాలు పట్టినారు ....ఊ.. ఊ..
బొమ్మలే విర్చినా కంబాలు కూల్చినా
కరములే నరికినా తలలు ఖండించినా
బెదరని చెదరని శిల్పాల వలనే
ఈ దేశ సంస్కృతి గళమెత్తి శిరమెత్తి
నిలిచి ఉండును సదా...నిజముగా..సనాతనా..
...చాడా శాస్త్రి...
మోడీని ఎందుకు అభిమానిస్తున్నావ్
కొందరు రాష్ట్రానికి ఇంత అన్యాయం చేసిన మోడీని ఎందుకు వెనకేసుకు వస్తున్నావ్ అని అడుగుతున్నారు..
నేను మన స్టేట్ కి గత 60సం.ల బట్టి జరుగుతున్న అన్యాయం గురించి బాధపడుతున్నాను.మీరందరు ఈ 13 జిల్లాలు 2014 తరువాత మాత్రమే కొత్తగా పుట్టినట్లు కాంగ్రెస్, తెదేపా ఈ 13 జిల్లాలను పూర్వం ఎప్పుడూ పాలించనట్లు మాట్లాడుతున్నారు.
ఉదా:
రాష్ట్రం విడిపోవడానికి, పోలవరానికి, కడప స్టీల్ ప్లాంట్ కి రైల్వే జోన్ కి ఏమిటీ సంబంధం? అంటే రాష్ట్రం విడిపోక పోతే అవి మనకు అవసరం లేదా? మోడీ ఇప్పుడు అవి ఇవ్వలేదని గొడవ పెడుతున్నాం. అంత ముఖ్యమైనవి అయితే గత 30 సం.లుగా అవి ఎందుకు తెచ్చుకోలేకపోయారో మనలని ఇంతకు ముందు పాలించిన పెద్దలు చెప్పవలసిన బాధ్యత లేదా?
అసలు ఎంతో సారవంతమైన జిల్లాలు, పేరు ప్రఖ్యాతులు గాంచిన పారిశ్రామిక వేత్తలు, వ్యాపారస్తులు, సినిమా రంగం వాళ్ళు ఈ 13 జిల్లాలు వాళ్లే కదా?
50/60 సం.ల పాలన తరువాత మా జిల్లాలు వెనకబడి ఉన్నాయి, హైదరాబాద్ పోవడం తో అనాధలం అయిపోయాం స్పెషల్ స్టేటస్ ఇవ్వండి అని ముష్టి ఎత్తుకోవలసిన అవసరం ఏం వచ్చింది?
ఎవరు దీనికి కారకులు ?
70 ఏళ్ళు పాలించిన కాంగ్రెస్/తెదాపా లా? బీజేపీ నా? వాళ్ల 70 ఏళ్ల తప్పులు కప్పి పుచ్చుకుందికి బీజేపీ ని తిడితే మనం స్వంత ఆలోచన లేకుండా తందాన తానా అంటున్నాం. మనకు 25 మంది.లోక్ సభ ఒక 10 మంది రాజ్యసభ ఎంపీ లు ఉంచుకొని
ఎవడో వెంకయ్య నాయుడు, ఇంకెవరో సుష్మ స్వరాజ్ మన రాష్ట్రానికి సంబంధించి ఇవి ఇవ్వండి అని పార్లమెంట్ లో ఎందుకు అడిగారు? మన వాళ్ళు ఏంచేస్తున్నారు ? 40 సం.ల అనుభవం ఉన్న రాష్ట్ర రాజకీయనాయకులు నిద్రపోయారా విభజన బిల్లు చదవకుండా?
బీజేపీ కి ఆంధ్రా తో ఉన్న సంబంధం ఏమిటి? ఎన్ని సార్లు ఎన్ని ఎంపీలను ఎమ్మెల్యేల ను ఎన్నుకున్నాం? వారిని తిట్టడానికి మనకు ఏ నైతిక హక్కు ఉంది.
మొన్న ఒక మీటింగ్ లో మన ముఖ్యమంత్రి గారు వేరే పార్టీనుండి వారి పార్టీలోకి మారిన ఎమ్మెల్యే తో ఏం అన్నారు? నువ్వు పూర్వం చాలా చేసిపెట్టమని నన్ను అడిగినా నువ్వు వేరే పార్టీలో ఉండడం చేత అవి నీకు అవి చేసి పెట్టలేదు అని చెప్పారు.
ఎమెర్జెన్సీ తరువాత దేశం అంతా కాంగ్రెస్ ని ఒడిస్తే మనం గెలిపిస్తే తరువాత అధికారంలోకి వచ్చాక ఆంధ్రాకి కాంగ్రెస్ ప్రత్యేకంగా చేసిన సాయం ఏమిటీ ?.
2004 లో సోనియా ప్రభుత్వం ఏర్పడడానికి మన రాష్ట్రం పంపిన 32 ఎంపీలు ముఖ్య కారణం కాదా?
వాజపాయ్ చక్కని పాలన అందించినా బాబు గారి మీద కోపంతో తెదేపాకి ఎంపీ సీట్లు రాకుండా తద్వారా వాజపాయ్ ని కేంద్రంలో అధికారంలోకి రాకుండా అవ్వడానికి మనం ఒక ముఖ్య కారణం కాదా?
కాంగ్రెస్ కి అంత సహాయం చేసిన మన ఆంధ్రాకి కాంగ్రెస్ 2014 వరకు 10 సం.ము లు అధికారం అనుభవించి చివరికి ఆఖరు సమయంలో ఆంధ్రా ఇబ్బందులు కనీసం పట్టించుకోకుండా రాష్ట్రం విడగొట్టలేదా?
ఇప్పుడు అదే కాంగ్రెస్ చాలా గొప్పది నమ్మండి అని ఎవడో వెధవ వాడి రాజకీయ స్వార్ధం కోసం చెపితే అవును గొప్పది
అని మళ్ళీ మనం పొగడటం లేదా?
పూర్వం కాంగ్రెస్ కానీ తెదేపా ఎప్పుడూ తెచ్చుకోలేనన్ని ప్రాజెక్టులు, విద్యాలయాలు నిదులు మోడీ ప్రభుత్వ హయాంలో గత 5 సం.లలో వచ్చాయి..మోడీకి విభజన బిల్లు 10 సం.ల సమయం ఇచ్చింది. కానీ 90% కి పైగా విభజన బిల్లులో అంశాలు మోడీ ప్రభుత్వం ఇచ్చింది..
మోడీ ఆంధ్రాకి ఏమి చేయలేదు అన్నవారు 2014 ముందు -
1. 24/7 కరెంటు ఉండేదా? లేదు. దేశంలో 24/7 కరంటు ఇవ్వడానికి కేంద్రము AP ని ముందు గా ఎన్నుకుంది
2. 2014 ముందు విభజన బిల్లులో పోలవరం 7 మండలాలు కలిపారా?
లేదు. మోడీ ప్రభుత్వం వచ్చాక మొట్టమొదటి ఆర్డినెన్స్ ఇదే.
3. ఉద్యోగుల కోసం హైదరాబాద్ నుండి గుంటూరు ప్రత్యేక రైల్ నడపాలి అన్న ప్రస్తావన బిల్లులో ఉందా?
లేదు. కానీ ఆంధ్రా ప్రభుత్వం అడిగిన వెంటనే సాంక్షన్ చేశారు
4. రాజధానిలో భూములమ్ముకున్న రైతులకు కాపిటల్ గెయిన్స్ టాక్స్ ఎగ్జిమ్ప్షన్ ఇవ్వమని బిల్లులో ఉందా?
లేదు. అయినా కేంద్రం ఇచ్చింది. చాలా మంది రైతులకు లక్షల్లో మిగిలింది.
5. 2014 ముందు టీడీపీ కాంగ్రెస్ 60 సం.లు పై బడి పాలించారు కదా..ఆంధ్రాకి AIIMS గురించి.ప్రయత్నించారా?
లేదు. విభజన చట్టంలో 10 సం.ల సమయం ఇచ్చారు. కానీ 5 సం.ల.లోపే ప్రారంభించారు మోడీ ప్రభుత్వం.
6. 2014 ముందు టీడీపీ, కాంగ్రెస్ 60 సం.ల పై చిలుకు పాలించారు. ముఖ్య నగరాలైన గుంటూరు, విజయవాడ కి భూగర్భ డ్రైనేజ్ గురించి పని మొదలెట్టారా?
లేదు. మోడీ ప్రభుత్వం వచ్చాకే ఈ పనులు మొదలు అయ్యాయి.
7..2014 ముందు అసలు విశాఖ, విజయవాడ, తిరుపతి, కాకినాడ ఎలా ఉండేవి.
2014 తరువాత వాటిని స్మార్ట్ సిటీస్ గా గుర్తించాక ఇప్పుడు ఎలా ఉన్నాయి?
8. 2004-14 మధ్య 10 సం.లు కాంగ్రెస్ కేంద్రం లోనూ రాష్ట్రంలోనూ కూడా పాలించింది కదా! పోలవరం ఎందుకు పూర్తిచేయలేకపోయింది?
2014 ముందు వరకు ఎన్ని నిధులు వచ్చాయి. 2014-18 మధ్య ఎన్ని నిధులు వచ్చాయి
9. ఐఐఎం, ఐఐటీ, ఐఐఐటీ, గిరిజన యూనివర్సిటీ, మెరైన్ ఇన్స్టిట్యూట్, ఫ్యాషన్ డిజైన్ ఇన్స్టిట్యూట్, ఇలా సుమారు 20 విద్యా సంస్థలు కొన్ని విభజన బిల్లు లో లేనివి కూడా 2014 ముందు వుండేవా?
లేవు 2014 తరువాత మాత్రమే వచ్చాయి.
10. వీధుల్లో 2014 ముందు led దీపాలు వుండేవా?
లేవు. మోడీ ప్రభుత్వం వచ్చాకే ఇవి వచ్చాయి
11. తిరుపతి, విజయవాడ, రాజమండ్రి విమానాశ్రయాలు 2014 ముందు ఎలా ఉండేవి?
ఎన్ని విమానాలు ఉండేవి?2014 తరువాత ఇప్పుడు ఎలా ఉన్నాయి?
12. కోటిపల్లి -నరసాపురం రైల్వే లైన్ 60 సం.ల బట్టి పెండింగ్ లో ఉంది. మోడీ వచ్చాక పనులు మొదలు అయ్యాయి. 50% పైగా పనులు పూర్తి అయ్యాయి.
13. పిఠాపురం-కాకినాడ రోడ్డు వెడల్పు కార్యక్రమం దశాబ్దాల బట్టి పెండింగ్. మోడీ ప్రభుత్వం వచ్చాకే దానిని 4 లేన్లు గా పెంచి హై వే కింద పని పూర్తి చేశారు.
14. తెనాలి -విజయవాడ మూడో లైన్ లేక మద్రాస్ ట్రైన్స్ విజయవాడ వచ్చేవి, వెళ్ళేవి చాలా ఆలస్యం అయ్యేది. మోడీ ప్రభుత్వం వచ్చాకే లైన్ పని ప్రారంభించి పూర్తి చేశారు.
15. 20,000 మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే విశాఖ మెడ్ టెక్ సిటీ మోడీ ప్రభుత్వం వచ్చాకే ప్రారంభం జరిగింది.
16. అనంతపురం దగ్గర కేంద్ర ప్రభుత్వ సంస్థ BEL భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ 750 కోట్లతో ప్రాజెక్ట్ ప్రారంభించింది.ఇది కూడా మోడీ ప్రభుత్వం వచ్చాకే.
17. కృష్ణ జిల్లాలో శ్రీహరికోటలాగా వెయ్యి కోట్ల ఖర్చుతో మరొక లాంచింగ్ పేడ్ DRDO వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. పర్యావరణ అనుమతులు కూడా వచ్చాయి. ఇది కూడా మోదీ ప్రభుత్వ హయాంలోనే.
18. పూర్వం ఎప్పుడైనా ఆంధ్రాలో ఒకే సారి కేంద్ర ప్రభుత్వం బీద వారికి ఇన్ని గృహాలు మంజూరు
చేసిందా ? సుమారు 7 లక్షల గృహాలు ఇచ్చింది.
19. UPA టైంలో 10 సం.లు పడుకున్న 6 వరుసలు నేషనల్ హైవే రణస్థలమ్-నరసన్నపేట 1500 కోట్ల ఖర్చుతో మోడీ ప్రభుత్వమే పని ప్రారంభించింది కదా!
20. మోడీ ప్రభుత్వం make in india అన్న తరువాతే కదా దేశంలో పరిశ్రమలు పెట్టడానికి వెంట వెంటనే క్లియరెన్స్ లు వస్తున్నాయి.పూర్వం ఒక్క ఎన్విరాన్మెంటల్ క్లియరన్స్ రావడానికే 2-3 సం.ల టైం పట్టేది. బోలెడు లంచాలు ఇవ్వవవలసి వచ్చేది..
ఈ Make In India కాన్సెప్ట్ వల్లే కదా మొబైల్ పరిశ్రమలు శ్రీ సిటీ.లో ప్రారంభం అయ్యాయి. కియా కూడా ప్లాంట్ పెట్టింది. తిరుపతిలో hardware పరిశ్రమలు తొందరగా ప్రారంభం అయ్యాయి..
21. క్రూడ్ ఆయిల్ స్టోరేజ్ వసతులు రాష్ట్రంలో మూడు చోట్ల ఏర్పాటు అయ్యాయి.
70 ఏళ్ళు కాంగ్రెస్ టీడీపీ ఈ 13 జిల్లాల అధికారాన్ని అనుభవించేసి తరువాత ఇప్పుడు సడన్ గా ఆంధ్రా వెనుకబాటు తనం గుర్తుకు వచ్చింది.
ఎదో కెసిఆర్ పుణ్యమా అని రాష్ట్రం విడగొట్టబట్టి మన టీడీపీ కాంగ్రెస్ నాయకులకు ఇప్పటికి అయినా ఉమ్మడి రాష్ట్రంలో ఈ 13 జిల్లాలు ఉన్న సంగతి గుర్తుకు వచ్చింది.
రాష్ట్రం విడిపోక ముందే పోలవరం 30 సం.ల ముందు అనుకున్నారు కదా..ఎందుకు పూర్తి చెయ్యలేదు?
2014 లో రాష్ట్రం విడిపోతుంది. అప్పుడు బీజేపీ వస్తుంది నిధులు ఇస్తుంది అనుకోని ఆపేసారా?
రైల్వే జోన్, కడప స్టీల్ ప్లాంట్ తీసుకోండి. రాష్ట్రం విడిపోవడానికి వాటికి ఏమిటీ సంబంధం? 2003 లో రైల్వే జోన్ భువనేశ్వర్లో పెడుతున్నప్పుడు బాబుగారు NDA కన్వీనర్. ఆంధ్రా ముఖ్యమంత్రి. అది భువనేశ్వర్ లో పెట్టడం ఎందుకు ఆపలేదు? వైజాగ్ లో పెట్టడానికి ఎందుకు వత్తిడి తేలేదు. ఎందుకంటే అప్పుడు ఆంధ్రా అంటే బాబుగారికి హైదరాబాద్ మాత్రమే.. ఇప్పుడు విశాఖ రైల్వే జోన్ కూడా వచ్చింది. వచ్చింది అని ఆనందించకుండా దానిలో కూడా లోపాలు వెతుకుతోంది తెలుగు మీడియా.
బీజేపీని విమర్శించేముందు 70 సం.లుగా మనలని పాలిస్తున్న మన టీడీపీ కాంగ్రెస్ ఎంపీ ఎమ్మెల్యే లను చొక్కాలు పట్టుకు అడగండి మా 13 జిల్లాలని ఎందుకు పట్టించుకోలేదు ఇన్ని సంవత్సరాలు నుంచి అని..
అయినా మోడీ నే తిడతాం. అంటే ..
గొర్రె కసాయి వాడినే నమ్ముతుంది అని సామెత మనకు అక్షరాలా సరిపోతుంది. అలా నమ్మించగలిగే తెలుగు మీడియా మనకి ఉంది.
అందుకే పచ్చ మీడియా మాయలో పడి స్వంత ఆలోచనను వదిలేసిన కొందరు మోడీని తిడుతున్న వాళ్ళను చూస్తే జాలి వేస్తోంది తప్ప బాధ కలగడం లేదు.
మోడీ - మన్మోహన్ - డాలర్ ధర
Chada Sastry గారి వాల్ మీద నుండిమోడీ భారత ఆర్ధిక వ్యవస్థను నాశనం చేసేస్తున్నాడు. రూపాయితో డాలర్ విలువ పడిపోతోంది అని రాహుల్ గాంధీ గారు మిగతా ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నారు.
ఒక సారి ఇది చూడండి..ఎవరు ఆర్ధిక వ్యవస్థ చక్కగా నడుపుతున్నారో?
2008 డాలర్ విలువ ₹43.51ps ఉంటే అది 2014లో మన్మోహన్ గారు దిగే సమయానికి ₹62.33ps చేరింది. అంటే 2008 నుండి 2014 మధ్య 6 సం.లలో డాలర్ తో రూపాయి విలువ సుమారు ₹18.82 ps తగ్గిపోయింది..
అప్పుడు ప్రముఖ ఆర్ధిక వేత్త బాగా చదువుకున్న అపర ఆర్ధిక మేధావి మన్మోహన్ గారు ప్రధాని మరియు హార్వార్డ్ లో MBA చదువుకున్న శ్రీ చిదంబరం గారు ఆర్ధిక మంత్రిగా వున్నారు..
అప్పుడు అంటే 2014 మోడీ ప్రభుత్వం వచ్చేసరికి విదేశీ మారక ద్రవ్య నిలువలు
$304.20 బిలియన్ డాలర్లు మాత్రమే. అంటే
₹22.80 లక్షల కోట్లు ఉన్నాయి. (ఒక$ 75రూ. చొ.)
సరే ! మరి 2014-2020 మధ్య 6 సం.లలో డాలర్ తో రూపాయి విలువ చూడండి.
2014 లో ₹62.33ps ఉంటే నేడు 10.01.2020 డాలర్ విలువ ₹73.38 ps ఉంది.
అంటే సుమారు ₹11.05ps మాత్రమే తగ్గింది.
ఇప్పుడు ఒక చదువు రాని చాయ్ వాలా ప్రధాని
విదేశీ చదువులు లేని సాధారణ గృహిణి ఆర్ధిక శాఖా మంత్రి.
ఇప్పుడు విదేశీ మారక ద్రవ్య నిలువలు
$541.62 బిలియన్ డాలర్లు.. అంటే రూపాయల్లో చెప్పాలి అంటే ₹40.62 లక్షల (ఒక$ 75రూ. చొ.) కోట్లు ఉన్నాయి. అప్పటి కంటే సుమారు ₹18 లక్షల కోట్ల రూపాయల మేర విదేశీ మారక నిల్వలు పెరిగాయి.
అందుచేత ఎవరైనా మోడీ ఆర్ధిక వ్యవస్థను నాశనం చేస్తున్నాడు అంటే గట్టిగా సమాధానం చెప్పండి.
DATA SOURCE : BookMyForex.Com



