Sunday, 18 October 2020

నేను ఏ మతానికి వ్యతిరేకం కాదు...కానీ

 నేను ఏ మతానికి వ్యతిరేకం కాదు....కానీ


అన్ని దేవుళ్ళు సమానమనే సంస్కృతి లో జన్మించిన వాడ్ని. అన్ని ఫొటోలు పూజించే వాణ్ని.  ఎవరికి నచ్చిన దేవుణ్ణి వాళ్లకు నచ్చిన రూపంలో పూజించుకో వచ్చు అని గాఢంగా నమ్మే వాడిని..


కాని నా దేవుడు మాత్రమే ఒక్క నిజమైన దేవుడు అతన్ని పూజించకపోతే పాపం.  మీరు పాపులగానే ఉండిపోతారు. చనిపోయాక నరకానికి పోతారు అన్న సూత్రానికి బధ్ధ వ్యతిరేకిని. ఎందుకంటే ఆ సూత్రం ప్రపంచ వినాశానికి దారితీసే అవకాశం ఉంది. ఉదాహరణకి ప్రపంచం లో 100 జనాభా ఉంది అనుకుందాం. 35,30,20,10,5 ముస్లిమ్స్,క్రిష్టియన్స్,బౌద్ధులు,హిందువులు మిగతా వారు ఇతరులు అనుకోండి.     పెద్ద మతాలైన ఇస్లాం, క్రిస్టియానీటీ మాత్రమే మా దేవుడే నిజమైన దేవుడు అని చెప్పి మిగతా మతాల వారిని వారి మతాల్లోకి మారుస్తున్నారు. కొన్ని సం.లు గడిచాక ఈ మతమార్పిడులు వల్ల ఇతర మతాలన్నీ పోయి ఒక్క క్రిస్టియన్స్,  ముస్లిమ్స్ మాత్రమే మిగిలారు అనుకుందాం. అప్పుడు ఏం జరుగుతుంది. ఈ రెండు మతాల వారు మా మతమే నిజమైన మతం. మా దేవుడొక్కడే నిజమైన దేవుడు అని అటువైపు మతం నుండి జనాలను తమ వైపుకు లాక్కుందికి ప్రయత్నిస్తారు. అప్పుడు ఘర్షణ, గొడవలు. చివరకు అమెరికా క్రిస్టియన్ ఆటంబాంబు గొప్పదా, ఇరాన్ ఇస్లాం బాంబు గొప్పదా అని తేల్చుకోవలసిన పరిస్థితి వస్తుంది. అప్పుడు ఇంక ఎవరి దేవుడు గొప్ప అని తేల్చుకోవలసిన అవసరమే ఉండదు.


మీరు అడగవచ్చు మరి మీరు హిందూ మతాన్ని పెంచాలని చూస్తున్నారు కదా. నిజమే. దానికి కూడా కారణాలు ఉన్నాయి. 


హిందూ మతం అన్నిటిలోనూ దేవుడు ఉన్నాడు. నీకు దేని మీద నమ్మకం గురి ఏర్పడితే దానినే దేవుడిగా పూజించు నిజం తెలుసుకుంటావు అని చెప్పాయి. ఈ ఒక్క విధంగా పూజిస్తే మాత్రమే దేవున్ని దర్శిస్తావు అని ఎక్కడా చెప్పలేదు.  అంత వెసులుబాటు ఉంది కాబట్టే రాయి, చెట్టు, జంతువు, ఆఖరకు ప్రాణహాని తలపెట్టే జంతువులకు కూడా దైవ స్థానం కల్పించారు. అందుకే ఎవరికైనా క్రీస్తుమీద కానీ అల్లా మీద కానీ నమ్మకం ఏర్పడి వారినే దేవుడుగా స్వీకరించినా తప్పుకాదు. హిందువు మతం చాలా విశాలమైనది. రాముడు కృష్ణుడు ఇలా కొన్ని వందల మంది దేవుళ్ళు ఉన్నా ఈ మధ్యకాలంలో ఏ కులమో తెలీదు ఎక్కడినుండి వచ్చారో తెలీదు ముస్లిమ్ అని తెలిసి కూడా కొన్ని కోట్ల మంది హిందువులు షిర్డీ సాయిబాబా గారిని పూర్తిగా దైవంగా నమ్మి కొలుస్తున్నారు. కాని వీరెవరూ కృష్ణున్ని కాని రాముణ్ణి కాని ఏసు ని కానీ అల్లాని ద్వేషించరు. కారణం వీరు కూడా అందరూ దేవుళ్ళే అని నమ్ముతారు కాబట్టి.


కాని ఒక వ్యక్తి క్రిస్టియన్‌ గా కాని ముస్లిమ్ గా మారిన వెంటనే ఇతర దేవుళ్ళందరిని ద్వేషించడం మొదలు పెడతారు. అందుకే అందరు దేవుళ్ళు ఒక్కటే అని ఎవరినైనా పూజించుకో వచ్చు అన్న సిధ్ధాంతం మానవాళి మనుగడకు అత్యావశ్యకము.  ఈ మధ్య అమెరికాలో సర్వే కండక్ట్ చేస్తే ఏ మత విశ్వాసం గొప్పది అంటే ఎక్కువ మంది హిందూ మతవిశ్వాసం అంటే అన్ని దేవుళ్ళూ ఒక్కరే చెప్పే హిందూ విశ్వాసం గొప్పది అని చెప్పారు. అది వ్యక్తికి పూర్తి స్వేఛ్ఛనిస్తుంది ఇతర పధ్ధతులను ఆక్షేపించదు. అందుకే మేము ఆ సిధ్ధాంతాన్ని ఇష్టపడతాం అని చెప్పారు.


మరి మీరు అడగవచ్చు హిందూ మతాన్ని మీరు ఎందుకు వెనకేసుకు వస్తున్నారు అని.

అన్ని దేవుళ్ళు సమానం అనే నమ్మే వారి సంఖ్య పెరిగితే మానవాళికి మంచిది. ఏ దేవుణ్ణి అయినా పూజించుకొనే అవకాశం వుంటుంది. 

కాని ఇలా మతమార్పిడుల లాటి వల్ల  'ఏ దేవుడైనా ఒక్కటే'  అని నమ్మేవారి సంఖ్య తగ్గిపోయి 'నా దేవుడొక్కడే నిజమైన దేవుడు" మిగతా వారు సాతనులు అన్న మత మౌఢ్యం ప్రపంచ శాంతికే ప్రమాదం.


స్వతః సిధ్ధంగా క్రిస్టియన్స్ గా పుట్టి అక్కడే పెరిగిన అమెరికా వారికికాని బ్రిటిష్ వారికికానీ లేక ఇతర పాశ్చాత్య క్రైస్తవులకు కానీ హిందూ మతం అంటే ద్వేషం లేదు. అందుకే వారు ఇండియా వచ్చినప్పుడు  హిందూ దేవాలయాలకు వెళ్తారు, పూజలు చేస్తారు, ప్రసాదాలు తింటారు, స్వామీజీల దగ్గరకు వెళ్తారు..గంగలో భక్తితో మునకలు వేస్తారు..కాని వారి క్రీస్తుని వారు వదులుకోరు.

హిందూ దేవుళ్లను కూడా గౌరవిస్తారు.  వారు నిజమైన క్రిస్టియన్స్.


అలాగే విదేశాల్లో ఉండే హిందువులు తమ పండగలతో పాటు క్రిస్మస్ లాటివి జరుపుకుంటారు. హిందువులు ఏ దేశంలో ఉంటే వారి స్వంత ఆచారాలను సంస్కృతిని పాటిస్తూ ఆ విదేశ సంస్కృతి సంప్రదాయాలను కూడా గౌరవిస్తారు. అక్కడ మెజార్టీ ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా ప్రవర్తించరు. అందుకే హిందువులు ఏ దేశంలో వున్నా ఆ దేశ ప్రజలతో మమేకమై జీవిస్తారు.

మేం మైనారిటీలం మాకు ప్రత్యేక హక్కులు, ప్రత్యేక కాలనీలు, వెసులుబాట్లు కావాలని డిమాండ్ చెయ్యరు.


కాని మనదేశంలో ఇలా మతం మారిన వారు మళ్ళీ వేరే దేవుణ్ణి పూజించిన దాఖలాలు ఉన్నాయా? ఉండవు. ఎందుకంటే క్రైస్తు అంటే ప్రేమ కంటే  హిందూఇజమ్ అంటే ద్వేషంతో నూరిపోసిన మాటలు విని మతం మారుతున్నారు. ఇక  ఇక్కడ భారత దేశంలో మత మార్పిడికి వాడుతున్న ఆయుధం కుల వివక్ఖ. హిందూమతంలో దళితులు ను  తక్కువగా చూసారు మా మతంలోకి వస్తే సమానత్వం దొరుకుతుంది అని. 

 దీని వలన వారు ఒక్క క్రైస్తు తప్ప ఇంకెవరూ దేవుడు కాడు అన్న మౌఢ్యం లోకి జారిపోతున్నారు. (కానీ క్రిస్టియన్ మతంలో ఎంత వివక్ష ఉండేదో ఇప్పుడు కూడా ఉందొ వారు నల్లవారిని ఎంత దారుణంగా చూసే వారో వేరే పోస్టులో వివరంగా పెడతాను.) 


విదేశాల్లో చాలా మంది క్రిస్టియన్స్ ముస్లిమ్స్ గా మారుతున్నారు. వారి ఆలోచనా విధానం కూడా ఇలానే ఉంటోంది. వారు ఇన్నాళ్లు ప్రేమించిన క్రీస్తునే ద్వేషించడం మొదలు పెడతారు.  కానీ చాలా మంది విదేశీ  క్రిస్టియన్స్ హరేకృష్ణ ఇస్కాన్ సంస్థ ద్వారా హిందూ ధర్మం పాటిస్తున్నారు. వారు మాత్రం ఒక పక్క కృష్ణుని ఆరాధిస్తూ క్రైస్ట్ ని కూడా ఆరాధిస్తారు.  కృష్ణుణ్ణి  ఆరాధించడం మొదలు పెట్టారు కాబట్టి క్రీస్తుని పూర్తిగా వదిలెయ్యరు.


అందుకే మతం మారినా అందరు దేవుళ్ళు సమానమే, ఎవరికి నచ్చిన దేవుణ్ణి వాళ్లు పూజించుకుంటారు అన్న సిధ్ధాంతం నమ్మితే ఎవరు ఏ మతంలో ఉన్నా మానవుడి మనుగడకు ప్రమాదం లేదు.


 🙏🙏🙏

చాడా శాస్త్రి

No comments:

Post a Comment