Sunday, 18 October 2020

చార్ ధామ్ నేషనల్ హై వే-హిందువుల చిరకాల స్వప్నం










చార్ ధామ్ నేషనల్ హై వే-హిందువుల చిరకాల  స్వప్నం

ఉత్తరాఖండ్ రాష్ట్రంలో రిషికేశ్ - కర్ణప్రయోగ్ మధ్య బ్రాడ్ గేజ్ సింగల్ రైల్వే లైన్ నిర్మించడానికి మోడీ సర్కారు 2018లో నిర్ణయం తీసుకుంది.

ఈ రైల్వే లైన్ 125 కి.మీ పొడవు ఉండి 12 స్టేషన్లు, 17 సొరంగాలు, 16 బ్రీడ్జ్ లు ఉంటాయి. చివరి స్టేషన్ కర్ణప్రయోగ సుమారు 4800 అడుగులు ఎత్తులో ఉంటుంది. సుమారు 85% రైల్వే లైన్ సొరంగాలు ద్వారానే వెళ్తుంది.

ఇది ఉత్తరాఖండ్ లో డెహ్రాడూన్, తెహ్రి ఘర్వాల్, పౌరి ఘర్వాల్, రుద్రప్రయాగ ,చమోలి మొత్తం 5 జిల్లాల ను కలుపుతూ వెళ్తుంది.

ఈ మార్గంలో న్యూ రిషికేశ్, శ్రీనగర్, తెహ్రి, శివపురి, దేవ ప్రయాగ, రుద్రప్రయాగ, 
కర్ణ ప్రయాగ ముఖ్య స్టేషన్లు. ప్రస్తుతం రోడ్డు మార్గంలో ప్రయాణ సమయం 7 గం.లు పైగా పడుతోంది అని ఈ రైలు మార్గం పూర్తి అయితే సుమారు 2.30 గం. లలో చేరుకోవచ్చు. 

ఇది మూడు అంచెలుగా నిర్మిస్తున్నారు. మొదటిది వీరభద్ర స్టేషన్ నుండి యోగ్ నగరి రిషికేశ్ స్టేషన్ వరకు ఈ సం.లోగా, రెండవది యోగ్ నగరి రిషికేశ్ నుండి దేవ ప్రయాగ 2023-24 లోగా చివరిలోగా,  ఇక ఆఖరి ఫేజ్ దేవప్రయాగ నుండి కర్ణ ప్రయాగ 2024-25కి పూర్తి చేద్దామని సంకల్పం. మొత్తం ప్రాజెక్టు ఖర్చు అంచనా ₹16,216 కోట్లు

ఈ దారిలో అన్నిటికన్నా పొడవైన సొరంగ రైలు మార్గం 15.8 కి.మీ పొడవు ఉంటుంది. ఇది దేవప్రయాగ వద్ద మొదలై జనాసు అన్న స్టేషన్ వరకు ఉంటుంది.  ఇప్పటికే చాల చోట్ల సొరంగాలు తవ్వే పని మొదలుపెట్టారు. అలాగే బ్రీడ్జ్ లు అన్ని ముందుగా వేరే చోట ఫాబ్రికేషన్ పనులు మొదలు పెట్టారు. పూర్తి అయిన వాటిని అంచెలంచెలుగా కొండల పైకి తరలించి బిగిస్తారు.

ఇది ముఖ్యంగా చార్ ధామ్ అంటే గంగోత్రి, యమునోత్రి, కేదార్, బదరి యాత్రకు వెళ్ళేవారికి బాగా సదుపాయమే కాకుండా రోజూ కొండల మించి కిందకు దిగే వేల మంది సామాన్య ప్రజలకు ప్రయాణ సమయం ఆదా అవుతుంది. ముఖ్యంగా వీరికి శీతాకాలంలో, వానా కాలంలో రోడ్లు మీద ప్రయాణం చాలా కష్ట సాధ్యం. ఈ రైల్ లైన్ వీరి ఇబ్బందులు తగ్గిస్తుంది. అలాగే పెద్ద పెద్ద లారీలు కొండల మీదకు పోలేవు కాబట్టి  ఈ రైల్ లైన్ సరకు రవాణా చాలా మెరుగుపరుస్తుంది. 

ఈ ప్రోజెక్టు లో మొదటి స్టేషన్ " యోగ్ నగరి రిషికేశ్" దాదాపు పూర్తి అయిపోవచ్చింది. ఈ స్టేషన్ ప్రస్తుతం ఉన్న హరిద్వార్ స్టేషన్ కన్నా పెద్దది. ఈ స్టేషన్ ని ముఖద్వారం కింద తీర్చి దిద్దడమే కాకా భవిష్యత్ లో జరిగే కుంభమేళాలకు వచ్చే యాత్రికుల సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని స్టేషన్ నిర్మించారు.

ఈ రైల్వే లైన్ పూర్తి అయితే హిమాలయాల్లో కొండల మీదుగా  సొరంగాలు ద్వారా బ్రిడ్జ్ లు మీదుగా రైల్లో ప్రయాణించడం యాత్రికులకు ఒక మధురానుభూతి మిగులుస్తుంది.

...చాడా శాస్త్రి...










 

 

No comments:

Post a Comment